మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఈరోజు ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఈ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ప్రమాద ఘటన పైన ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్న చంద్రబాబు గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం పైన సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ప్రమాద ఘటనపైన స్పందించిన లోకేష్

ఈ ప్రమాదంపై విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాదం పైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ప్రయాణికులు సజీవ దహనమైన సంఘటనపై స్పందించిన విద్యుత్ శాఖా మంత్రి

రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అని ఆయన అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ప్రయాణికులు సజీవ దహనమైన సంఘటన పైన స్పందించారు. అధికారులతో మాట్లాడి సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు.

ప్రమాద ఘటనపై ప్రభుత్వానికి ప్రజల విజ్ఞప్తి

క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించాలని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో ప్రజలు ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *