రైల్వే ట్రాక్‌మ్యాన్‌ల కన్నీటి గాథ! ప్రాణాలకు తెగించి మీ కోసం.. 💔Railway

ఎక్స్‌ప్రెస్.. భారంగా కదిలే గూడ్స్ బండి.. రైలు ఏదైనా సరే, అది సురక్షితంగా గమ్యస్థానానికి చేరుతోందంటే దానికి కారణం పట్టాల వెంట నడిచే ఆ అదృశ్య సైనికులే! వారే రైల్వే భద్రతకు మొదటి రక్షణ కవచాలైన కీమ్యాన్ మరియు ట్రాక్‌మ్యాన్‌లు. జోరు వానైనా, మండే ఎండైనా.. అర్ధరాత్రైనా, పట్టపగలైనా.. పట్టాలను పరీక్షిస్తూ మరయంత్రాల్లా పనిచేసే వీరి జీవితాలు మాత్రం నేడు భరోసా లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.Railway

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఏటా సుమారు 26 కోట్ల మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేయడంలో వీరి పాత్ర కీలకం. కానీ, పెరుగుతున్న రైల్వే నెట్‌వర్క్‌కు అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెరగకపోవడం వీరిపై తీవ్ర పని ఒత్తిడిని పెంచుతోంది. ఒంటరిగా విధులకు వెళ్లే కీమ్యాన్ కష్టాలు వర్ణనాతీతం. రోజుకు 8 నుండి 10 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తూ, పట్టాల్లోని అణువణువును క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. చీకటిలో అడవి జంతువులు, పాములు, దొంగల భయాన్ని ఎదుర్కొంటూనే.. లక్షల మంది ప్రాణాలకు రక్షణగా నిలవాలి.Railway

ట్రాక్‌మ్యాన్‌ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గతంలో స్లీపర్ బరువు 286 కిలోలు ఉంటే, ఇప్పుడది 332 కిలోలకు పెరిగింది. ఎనిమిది మంది మోయాల్సిన బరువును కేవలం నలుగురే మోయాల్సి వస్తోంది. పట్టాల వెంట గడ్డి తీయడం నుండి మురికికాలువల శుభ్రం వరకు 30కి పైగా కఠినమైన పనులు వీరిపై భారంగా మారాయి. రక్షణ కవచాలుగా ఉండాల్సిన వీరిపై ఏటా దేశవ్యాప్తంగా సుమారు 300 మంది పట్టాలపైనే ప్రాణాలు వదలడం ఆందోళన కలిగిస్తోంది. కనీసం పట్టాల వెంట కంకర సరిచేయడానికి, శుభ్రం చేయడానికి ఆధునిక యంత్రాలు కూడా ఇవ్వకపోవడం వీరి దుస్థితికి అద్దం పడుతోంది. “రైల్వే నెట్‌వర్క్ పెరుగుతోంది.. కానీ సిబ్బంది పెరగడం లేదు” అని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల జీవితాలకు వెలుగునిచ్చే ఈ శ్రామికుల జీవితాల్లో భరోసా నింపే నాథుడెవరని రైల్వే శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.Railway

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *