Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

సామాన్య తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడేలా చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మార్కెట్లోకి రావాల్సిన ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణపై ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. ఏప్రిల్ ముగుస్తున్నా టెండర్ల ఊసే లేదు. అధికారుల నిర్లక్ష్యం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు కాసులు కురిపిస్తుంటే, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం అప్పుల కుప్పలను మిగిలిస్తోంది.Education Department Negligence,
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల వరకు చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ సిలబస్ పుస్తకాలనే చదవాలి. కానీ, విక్రయ పుస్తకాలు మార్కెట్లో దొరకకపోవడాన్ని అదనుగా తీసుకుంటున్న ప్రైవేట్ యాజమాన్యాలు.. సొంత మెటీరియల్ పేరిట దోపిడీకి తెరలేపాయి. ప్రభుత్వ పుస్తకాల ధర 1,500 రూపాయలు మించదు.. కానీ ప్రైవేట్ స్కూళ్లు అంటగడుతున్న మెటీరియల్ ధర ఏకంగా 8 వేల నుంచి 12 వేల రూపాయల వరకు ఉంటోంది. ఏటా వందల కోట్ల రూపాయల భారం తల్లిదండ్రులపై పడుతున్నా విద్యాశాఖ ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక మర్మమేంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు.Education Department Negligence,
సాధారణంగా ప్రతి ఏటా జనవరి లేదా ఫిబ్రవరిలోనే టెండర్లు పిలుస్తారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ ముగుస్తున్నా విద్యాశాఖ ఆమోద ముద్ర పడలేదు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అంటే జూన్ 1 నాటికైనా పుస్తకాలు మార్కెట్లోకి రావాలి. టెండర్ ప్రక్రియ పూర్తి కావడానికే కనీసం నెల రోజులు పడుతుండగా, ఇక ముద్రణ ఎప్పుడు? పంపిణీ ఎప్పుడు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చే ఉచిత పుస్తకాలు 75 శాతం సిద్ధంగా ఉన్నాయని చెబుతున్న అధికారులు.. అమ్మకానికి వచ్చే పుస్తకాల విషయంలో మాత్రం చేతులెత్తేయడం దారుణం. తల్లిదండ్రులు మే 15 నుంచే పుస్తకాల కొనుగోలుకు సిద్ధపడతారు. ఆ సమయానికి మార్కెట్లో పుస్తకాలు అందుబాటులో లేకుంటే, మళ్ళీ ప్రైవేట్ పబ్లిషర్ల దోపిడీకి బలికాక తప్పదు. విద్యాశాఖ ఇకనైనా నిద్ర మేల్కొని టెండర్ల దస్త్రాన్ని వెంటనే ఆమోదించాలని అఖిల భారత విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.Education Department Negligence,