ఏసీబీని చూసి పొలాల్లోకి పరుగులు.. ఎస్సై రాజేష్ అరెస్ట్! Medak’

లంచం తీసుకోవడమే కాకుండా, ఏసీబీ అధికారులను చూసి పొలాల్లోకి పరుగులు తీసిన ఒక ఖాకీ అధికారి హైడ్రామా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచిత్ర ఉదంతం వివరాల్లోకి వెళ్తే… Medak’

చట్టాన్ని రక్షించాల్సిన చేతులే లంచం కోసం చాచాయి. ఒక చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండటానికి, కొత్త చట్టం 35 BNSS సెక్షన్ కింద నోటీసు ఇచ్చి ఊరట కలిగిస్తానని నమ్మబలికాడు టేక్మాల్ ఎస్సై రాజేష్. ఈ పని కోసం బాధితుడి నుంచి ఏకంగా 30 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. Medak’

ముందుగా అనుకున్న పథకం ప్రకారం, బాధితుడు పోలీస్ స్టేషన్‌లోనే ఎస్సై రాజేష్‌కు నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. అధికారులను చూడగానే ఆ ఎస్సై గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తనను పట్టుకుంటారని భయపడి, స్టేషన్ వెనుక ఉన్న పొలాల్లోకి కిలోమీటర్ల మేర పరుగులు తీశాడు. సినిమాల్లో పోలీసులు దొంగలను వెంబడించినట్లు, ఇక్కడ ఏసీబీ అధికారులు ఎస్సైని వెంబడించడం విశేషం. చివరికి ఏసీబీ బృందం ఆయన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. Medak’

ఎస్సై లంచం తీసుకుంటూ చిక్కాడన్న వార్త తెలియగానే, బాధితులతో పాటు గ్రామస్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకోవడం గమనార్హం. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తానని చెప్పి అడ్డంగా దొరికిపోయిన ఈ అధికారి వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు శాఖకే మచ్చ తెస్తున్నాయని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Medak’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *