Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఈరోజు ఘోర బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఒక టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఘటన పైన ఏపీ అధికారులతో మాట్లాడాలని ఆయన సి ఎస్ రామకృష్ణారావును ఆదేశించారు.

బస్సు జగిత్యాల నుంచి బయలుదేరిన క్రమంలో బస్సులో ఉన్న తెలంగాణాకు చెందిన ప్రయాణికుల వివరాలను తెలుసుకోవాలన్నారు. సీఎం ఆదేశాలతో ఏపీ సీఎస్ తో తెలంగాణ సిఎస్ మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే బస్సు ప్రమాద ఘటన పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, అనిత జనార్దన్ రెడ్డి తోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రమాదం జరిగిన తీరు పైన ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు జిల్లా కలెక్టర్, ఎస్పీ వివరించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారని, వారిలో 13 మంది మృతి చెందారని, 22 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణలో జగిత్యాల నుండి వస్తున్నట్టు పేర్కొన్నారు.
బస్సు డ్రైవర్ ను విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయినట్టు చెప్పారని, అందువల్లే ఆక్సిడెంట్ జరిగినట్టుగా చెప్పారని వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం తో పాటు బాధితులకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.