Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లో ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే పార్టీ సింబల్, విధివిధానాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా కవిత ప్రకటించే అవకాశముంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లో ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కవిత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మార్చి 27 నే పార్టీ జెండా, ఎజెండాతోపాటుగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ గుర్తును కూడా ప్రకటించనున్నారు.
ఇక తెలంగాణ అస్తిత్వం, అభివృద్ధి లక్ష్యంగా కవిత పార్టీ పని చేయనుందని సమాచారం. అదే రోజున జరగబోయే భారీ బహిరంగ సభలో తన రాజకీయ వ్యూహాన్ని కవిత వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కవిత తన పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పేరుతో పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయగా, దీనిపై దిల్లీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తికానుందని సమాచారం అందుతోంది. అలాగే యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల నెరవేరనున్న తరుణంలో సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలని కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల ఎంత ముఖ్యమో.. ఓబీసీ మహిళలకు సబ్ కోటా అంతే ముఖ్యం అని అన్నారు. ఓబీసీ మహిళలకు ఉప కోటా కల్పించకపోవడం మెజారిటీ ప్రజలను మోసం చేయటమే అని కవిత అభిప్రాయపడ్డారు.