Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124


ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి (NH-365BG) పై అధికారికంగా టోల్ వసూళ్లు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని సోమవరం ఎంట్రీ పాయింట్ వద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య, సైట్ ఇంజినీర్ తేజారెడ్డి ఈ టోల్ సేవలను సోమవారం ప్రారంభించారు.
నెల రోజులుగా ఈ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు పనులు ఇంకా కొన్ని చోట్ల పూర్తి కావాల్సి ఉంది, అవి పూర్తయిన వెంటనే పూర్తిస్థాయిలో టోల్ వ్యవస్థ అమల్లోకి వస్తుంది.