కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు! రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన KTR

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి! భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక కీలక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.KTR

“తెలంగాణపై మళ్లీ కుట్రలు ప్రారంభమయ్యాయి!” అంటూ కేటీఆర్ చేసిన హెచ్చరిక రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ మళ్లీ ఏకమవుతున్నాయని, రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు పథకాలు రచిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అయితే, ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.KTR

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ పదునైన విమర్శలు సంధించారు. “దిల్లీ విమానం ఎక్కడం.. దిగడం తప్ప, గడిచిన రెండున్నరేళ్లలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి?” అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి, కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికే రేవంత్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలెవరూ ఆయన్ను ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని, అందుకే తెలంగాణ సాధకుడు కేసీఆర్‌పై అడ్డగోలు విమర్శలు చేస్తూ పబ్లిసిటీ పొందుతున్నారని ఎద్దేవా చేశారు.KTR

హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత పిల్లుట్ల రఘు, తన అనుచరులతో కలిసి భారాసలో చేరిన సందర్భంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారే నాయకులకు గట్టి హెచ్చరిక జారీ చేస్తూ.. “పార్టీ మారిన తర్వాత ఏ నాయకుడికీ రాజకీయ ఉనికి ఉండదు” అని స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌లో గతంలో పార్టీ మారిన ఒక మాజీ ఎమ్మెల్యే, కనీసం తన సొంత గ్రామంలో సర్పంచిని కూడా గెలిపించుకోలేకపోయారని ఉదాహరణతో సహా విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ ప్రాంతానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.KTR

కాంగ్రెస్ ఇచ్చిన 100 రోజుల హామీల పైనా కేటీఆర్ విరుచుకుపడ్డారు. 30 నెలలు గడిచినా ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేదని, గ్యారంటీ కార్డుల పేరుతో ప్రజలకు రంగుల సినిమా చూపించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “రూ. 3,70,000 కోట్ల అప్పు తెచ్చారు కానీ, ఒక్క ఇటుక కూడా పేర్చలేదు” అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నిధులన్నీ కేవలం కాంట్రాక్టుల కమీషన్లకే ఖర్చయ్యాయని ఆయన మండిపడ్డారు.

నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ సమస్యను 60 ఏళ్ల పాటు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విస్మరిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం ‘మిషన్ భగీరథ’తో ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించిందని గుర్తు చేశారు. యాదగిరిగుట్టను రూ. 1,800 కోట్లతో అత్యద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు. కేసీఆర్ అభివృద్ధి ఒకవైపు.. కాంగ్రెస్ కుట్రలు మరోవైపు ఉన్నాయని, ప్రజలే సరైన తీర్పు ఇస్తారని కేటీఆర్ ప్రసంగాన్ని ముగించారుKTR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *