Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124


దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రాధాన్యత ఇస్తూనే, రాజ్యసభ మరియు శాసనమండలి స్థానాల విషయంలో కేంద్రం మౌనం వహించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.[telangana,andhrapradesh]
కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, దేశంలోని అన్ని లోక్‌సభ మరియు శాసనసభ నియోజకవర్గాల్లో సీట్ల సంఖ్యను 50 శాతం పెంచాలని ప్రతిపాదించారు. ఇది అమలులోకి వస్తే, దేశ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోనుంది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల సంఖ్య గరిష్ఠంగా 850కి చేరుకునే అవకాశం ఉంది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర శాసనసభల మొత్తం స్థానాల సంఖ్య 4,123 నుంచి 6,385కి పెరగనుంది.[telangana,andhrapradesh]
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నప్పటికీ, ఎగువ సభలుగా పిలువబడే రాజ్యసభ మరియు శాసనమండలి స్థానాల పెంపు గురించి కేంద్రం బిల్లులో ఎటువంటి ప్రతిపాదనలు చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో అంతర్భాగమైన ఈ సభల సభ్యుల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇక్కడ కూడా 50 శాతం పెంపు అమలు జరిగితే, రాజ్యసభ సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 245 నుంచి 369కి పెరుగుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి (విధాన పరిషత్) ఉనికిలో ఉంది. ఉత్తరప్రదేశ్ (100), మహారాష్ట్ర (78), బిహార్ (75), కర్ణాటక (75), ఆంధ్రప్రదేశ్ (58), తెలంగాణ (40) రాష్ట్రాల్లో కలిపి మొత్తం 426 మంది సభ్యులు ఉన్నారు.
పునర్విభజన సూత్రం ప్రకారం ఇక్కడ కూడా 50 శాతం సీట్లు పెంచితే, మొత్తం సభ్యుల సంఖ్య 639కి చేరుతుంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం కింది విధంగా మారుతుంది:
అయితే, బిల్లులో దీనిపై స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతానికి ఎగువ సభల సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం కనిపించడం లేదు. లోక్‌సభ స్థానాల పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే ప్రాతినిధ్య నష్టంపై చర్చ జరుగుతున్న వేళ, ఎగువ సభల స్థానాల పెంపు అంశం తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది
రాజ్యసభని ఎగువసభ లేదా పెద్దల సభగా పిలుస్తారు. ప్రస్తుత 245 సభ్యుల సంఖ్యను 250 వరకు పెంచడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని సవరిస్తే సరిపోతుంది. 250 కంటే ఎక్కువ పెంచాలంటే, ఆర్టికల్ 80లో మార్పులు చేస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. ఈ బిల్లు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్లో ఉంది. కొత్తగా సీట్లు పెంచినప్పుడు, ఈ షెడ్యూల్లో మార్పులు చేయాలి. శాసనమండలి విషయానికొస్తే సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3వ వంతుకు మించకూడదు. 40 కంటే తక్కువ ఉండకూడదు (కొన్ని మినహాయింపులు ఉంటాయి). సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు. ప్రతీ రెండేళ్లకు మూడు వంతుల మంది పదవీ విరమణ పొందుతారు. శాసనమండలి స్థానాలను పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి, పార్లమెంటు ఆమోదం పొందడం తప్పనిసరి. ఇది కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బిల్లులో వీటి ప్రస్తావన లేకపోవడంతో రాజ్యసభ, శాసనమండలి సభ్యుల సంఖ్య పెంపు దాదాపు లేనట్టుగానే అంతా భావిస్తున్నారు.