ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి రాష్ట్రస్థాయి ర్యాంకర్లకు జ్ఞాపికల అందజేత NTR

విజయం అనేది అంతిమం కాదు.. అపజయం అనేది ప్రమాదకరం కాదు.. నిరంతరం కొనసాగించే ధైర్యమే అసలైన విజయం అంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా గండిపేటలోని ఎన్టీఆర్ కుటీరంలో ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు ఘనంగా అభినందన వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు జ్ఞాపికలు అందజేసిన భువనేశ్వరి గారు, వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.NTR

కేవలం ర్యాంకులు మాత్రమే విజయానికి ప్రమాణం కావని, విద్యార్థులు సాధించిన ఈ విజయం ఇక్కడితో ఆగిపోకుండా మరెంతో మందికి ప్రేరణగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన అంబానీ, ప్రధాని మోదీ, దివంగత నేత ఎన్టీఆర్ మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మీపై మీరు నమ్మకం ఉంచుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని విద్యార్థినులకు ధైర్యాన్ని నూరిపోశారు.NTR

ఎన్టీఆర్ విద్యాసంస్థల ప్రతిభను ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో పదిమంది చొప్పున, అలాగే ద్వితీయ సంవత్సరంలో 65 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులవ్వడం విశేషం. ఈ విజయం విద్యార్థుల కష్టానికి, ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని భువనేశ్వరి గారు పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యే భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని ఆమె ఉద్ఘాటించారు. వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్‌ ఎస్‌జేరెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.NTR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *