అన్నింటికీ ఒకటే టికెట్‌.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలా..HYDERABAD

ఆర్టీసీ బస్సు… మెట్రో…ఎంఎంటీఎస్‌… ఓలా..ఊబర్‌…ఇలా ఏ రవాణా సౌకర్యాన్నైనా ఒకే టికెట్‌తో ఉపయోగించుకునే అవకాశం త్వరలో నగరవాసులకు రానుంది. ఇందుకు అవసరమైన కామన్‌ మొబిలిటీ యాప్‌ను యూనిఫైడ్‌ మెట్రోపాలిటిన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఉమ్టా) అందుబాటులోకి తెస్తోంది. యాప్‌ను రూపొందించేందుకు కన్సల్టెంట్‌ నియామకానికి మంగళవారం హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఈ యాప్‌ ద్వారా టికెట్‌ తీసుకుని ఎక్కడ నుంచి ఎక్కడికైనా నచ్చిన సర్వీసులో ప్రయాణించవచ్చు.HYDERABAD

ఏమిటీ యాప్‌ ప్రత్యేకత…HYDERABAD

  • ఒక వ్యక్తి అమీర్‌పేట నుంచి సుచిత్ర జంక్షన్‌కు వెళ్లాలంటే, ప్రస్తుతం బస్సు లేదా మెట్రోలో సికింద్రాబాద్‌ వరకు, అక్కడ నుంచి ఓలా..ఊబర్‌లో ఆటో లేదా క్యాబ్‌ బుక్‌ చేసుకోవాలి. తక్కువ ఖర్చులో అనుకుంటే బస్సులో వెళ్లాలి.HYDERABAD
  • స్మార్ట్‌ఫోన్‌లో కామన్‌ మొబిలిటీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లాలో అందులో పేర్కొంటే చాలు… ఆయా ప్రాంతాలకు ఎలా చేరవచ్చో తెలిసిపోతుంది. మెట్రో లేదా ఎంఎంటీఎస్, బస్సు సేవలు ఎక్కడ వరకు ఉన్నాయి.. తర్వాత అక్కడ నుంచి ఎలా వెళ్లాలో సూచిస్తుంది.HYDERABAD
  • యాప్‌లోనే టికెట్‌ బుక్‌ చేసి డబ్బు చెల్లిస్తే క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది. దానిని ఉపయోగించి మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీలో ప్రయాణించవచ్చుHYDERABAD
  • నిర్ణీత ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఓలా, ఊబర్‌ను ప్రత్యేకంగా బుక్‌ చేయకుండానే తొలుత తీసుకున్న టికెట్‌పై ప్రయాణం చేయవచ్చు. ప్రయాణికులు సంబంధిత స్టేషన్‌కు చేరుకునే సమయానికి అక్కడ ఆయా అగ్రిగేటర్లు సిద్ధంగా ఉంటారు. వాళ్ల పూర్తి వివరాలు సైతం యాప్‌లో కన్పిస్తాయి.HYDERABAD
  • గతంలో ప్రభుత్వం ‘మీ టికెట్‌’ మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. నగరంలోని పబ్లిక్‌ పార్కులు, ఆలయాలు, చారిత్రక ప్రదేశాల సందర్శనకు ఈ యాప్‌ ద్వారా టికెట్‌ కొనుగోలు చేయొచ్చు. కామన్‌ మొబిలిటీ యాప్‌లో ఈ సేవలనూ అనుసంధానం చేయనున్నారు. HYDERABAD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *