Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

2023-24 – 2024-25 మధ్య 117.9 శాతం వృద్ధి Engineering Exports Telangana,
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. ఇప్పటివరకు కేవలం ఫార్మా, ఐటీ రంగాలకు చిరునామాగా ఉన్న రాష్ట్రం, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్ ఎగుమతుల హబ్‌గా అవతరించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం విశేషం.
కేంద్ర ప్రభుత్వ ‘నేషనల్ ఇంపోర్టు-ఎక్స్‌పోర్టు రికార్డు ఫర్ ఇయర్లీ ఎనాలిసిస్ ఆఫ్ ట్రేడ్’ (NIRYAT) పోర్టల్ గణాంకాల ప్రకారం.. 2023-24 నుండి 2024-25 మధ్య కాలంలో తెలంగాణ ఇంజినీరింగ్ ఎగుమతుల్లో 117.9% వృద్ధిని నమోదు చేసింది. ఈ భారీ వృద్ధితో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 4వ స్థానానికి చేరుకుంది. 2022-23లో కేవలం 1,827 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, 2024-25 నాటికి ఏకంగా 7,536 మిలియన్ డాలర్లకు చేరడం ఒక అద్భుతమైన మైలురాయి.
తెలంగాణ సాధించిన ఈ అసాధారణ వృద్ధికి ప్రధాన కారణం ఏరోస్పేస్ మరియు రక్షణ (Defence) రంగాల్లో పెరిగిన ఉత్పత్తి. హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలైన లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, ఎయిర్‌బస్, సఫ్రాన్ వంటి సంస్థలు తమ విడిభాగాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. విమాన విభాగాలు, రక్షణ పరికరాలు, మరియు పారిశ్రామిక యంత్రాల ఎగుమతులు పెరగడంతో రాష్ట్ర సరకుల ఎగుమతుల్లో ఇంజినీరింగ్ వస్తువుల వాటా ఏకంగా 38.44%కి చేరింది.
దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ వృద్ధి రేటు అత్యంత ఆశాజనకంగా ఉంది. ఇదే కాలంలో పొరుగు రాష్ట్రాల సగటు వృద్ధి కేవలం 10% మాత్రమే ఉండగా, తెలంగాణ 103% వార్షిక సమ్మిళిత వృద్ధి రేటును (CAGR) నమోదు చేయడం గమనార్హం. గత ఏడాది 8వ స్థానంలో ఉన్న రాష్ట్రం, కేవలం ఏడాది కాలంలోనే నాలుగు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరడం పారిశ్రామిక అనుకూల విధానాలకు నిదర్శనం.
పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని మూడు కీలక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది:
రానున్న పదేళ్లలో ఇదే తరహా వృద్ధిని కొనసాగించాలనే లక్ష్యంతో పరిశ్రమల కోసం భారీగా భూములు సమకూరుస్తూ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది.