భక్తులకు శుభవార్త! 7 సులభమైన స్టెప్స్‌లో ఆన్‌లైన్ బుకింగ్ పూర్తి చేయండి |TTD Divyanugraha Homam|

TTD Divyanugraha Homam: తిరుమల రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా.. భక్తులకు మరో ఛాన్స్.. హోమం టికెట్లు బుక్ చేసుకోండి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి, ఆర్జిత సేవల కోసం టీటీడీ టికెట్లు జారీ చేస్తుంది. ప్రతి నెలా ఆన్‌లైన్ ద్వారా ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్ అంగ ప్రదక్షిణ, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదులు విడుదల చేస్తుంది. వీటితో పాటుగా దివ్య దర్శనం, సర్వ దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్కువమంది భక్తులు ప్రతి నెలా టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఈ టికెట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొందరు భక్తులకు దొరకని పరిస్థితి. ఈ రూ.300 దర్శన టికెట్లు దొరకకపోయినా పర్లేదు.. వీరికి మరో అద్భుత అవకాశం కల్పిస్తోంది టీటీడీ.భక్తులకు శుభవార్త! 7 సులభమైన స్టెప్స్‌లో ఆన్‌లైన్ బుకింగ్ పూర్తి చేయండిభక్తులకు శుభవార్త! 7 సులభమైన స్టెప్స్‌లో ఆన్‌లైన్ బుకింగ్ పూర్తి చేయండి

టీటీడీ ప్రతి రోజు అలిపిరిలోని సప్తగోప్రదక్షిణశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తోంది. ఈ హోమం టికెట్లను ప్రతి నెలా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. భక్తులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు బుక్ చేసుకుంటే రూ.300 ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. తిరుమల శ్రీవారి భక్తులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్‌ను రూ.1600తో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.. హోమంలో పాల్గొనేందుకు ఇద్దరిని అనుమతిస్తారు. అలిపిరిలో సప్తగోప్రదక్షిణశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొన్న తర్వాత.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. టీటీడీ మే నెలకు సంబంధించిన శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 25న (శనివారం) ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *